వార్తలకు తిరిగి వెళ్లండి

కుప్పం మండలం పైబోధగుట్ట గ్రామంలో డీకేటి భూమి వివాదం రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. బుధవారం రాళ్లు, కర్రలతో దాడి చేసుకున్న ఘటనపై పోలీసులు స్పందించారు. ఇరువర్గాల ఫిర్యాదుల మేరకు సెల్వరాజ్, కస్తూరి, రాజేశ్వరి, రాధమ్మతో పాటు సౌందర్య రాజ్, చిన్నస్వామి, మురుగన్‌లపై కేసులు నమోదు చేశారు.
ఈ ఘర్షణతో గ్రామంలో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు విచారణ చేపట్టారు.
Comments
Loading comments...

