Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

20 ప్రాంతాల్లో ‘లేబర్ అడ్డాల’ నిర్మాణం

Follow Udayam on Google
Aditi Rai May 30, 2026 11:28 AM అమరావతిGeneral
20 ప్రాంతాల్లో ‘లేబర్ అడ్డాల’ నిర్మాణం - Udayam
కార్మికుల సౌకర్యార్థం రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 20 ప్రదేశాల్లో ‘లేబర్ అడ్డాలు’ (ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ ఎమినిటీస్ కాంప్లెక్స్) నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కార్మిక శాఖ కార్యదర్శి ఎం.వి.శేషగిరిబాబు ఉత్తర్వులు జారీ చేశారు. వీటి నిర్మాణం, నిర్వహణను పీపీపీ (PPP) పద్ధతిలో చేపట్టనున్నారు. ప్రస్తుతం తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలో ఇవి అందుబాటులో ఉండగా, రాజమండ్రి, నెల్లూరులలో ఏర్పాటుకు పనులు జరుగుతున్నాయి. వీటితో పాటు మరో 20 మున్సిపల్ ఏరియాల్లో ఈ కాంప్లెక్స్‌లను నిర్మించేందుకు త్వరలోనే టెండర్లు ఆహ్వానించనున్నారు.

Comments

G
Loading comments...