Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లాడ్జీలపై పోలీసుల ఆకస్మిక తనిఖీలు

Follow Udayam on Google
dineshkumar Sep 10, 2026 9:41 PM చిత్తూరుGeneral
లాడ్జీలపై పోలీసుల ఆకస్మిక తనిఖీలు - Udayam
చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి, ఆదేశాల మేరకు చిత్తూరు 1 టౌన్ పరిధిలోని లాడ్జీలపై ఎస్‌ఐ నాగప్ప నాయక్, సిబ్బంది ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. లాడ్జీల్లో అతిథుల నమోదు, గుర్తింపు పత్రాలు, సీసీటీవీ కెమెరాలు, లైటింగ్ సదుపాయాలను పరిశీలించారు. మత్తు పదార్థాలు, జూదం, ఇతర అక్రమ కార్యకలాపాలకు తావివ్వొద్దని యజమానులను హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...