కూలీ నుంచి ఎంపీపీగా

చిత్తూరు జిల్లా నిండ్ర మండలానికి చెందిన 28 ఏళ్ల మాలతి కూలీ పనుల నుంచి ఎంపీపీ పదవిని అధిష్ఠించారు. కన్నికాపురం ఎస్టీ కాలనీకి చెందిన ఆమెను తెదేపా నాయకులు ఎలాకటూరు సెగ్మెంట్ నుంచి బరిలో దించారు.
ఎంపీపీ పదవి ఎస్టీలకు రిజర్వ్ కావడంతో మరో ఎస్టీ మహిళ కూడా గెలిచారు. ఇద్దరూ చెరో రెండున్నరేళ్లు పదవి చేపట్టాలని ఎమ్మెల్యే భానుప్రకాష్ సూచించగా, తొలి విడతలో మాలతికి అవకాశం దక్కింది.
Comments
Loading comments...
