వార్తలకు తిరిగి వెళ్లండి

కురుపాంలోని రావడ రోడ్డు కూడలి సమీపంలో కాలువల నుంచి మురుగునీరు రోడ్డుపైకి ప్రవహిస్తోంది. దీంతో అటువైపుగా ప్రయాణించే వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
గతంలో అధికారులు దీనిపై చర్యలు తీసుకున్నప్పటికీ, మళ్లీ అదే సమస్య మొదలైందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వారు కోరుతున్నారు.
Comments
Loading comments...

