వార్తలకు తిరిగి వెళ్లండి
కుబీర్ మండలం కుప్టీ గ్రామంలో కృష్ణాష్టమి వేడుకలు శనివారం వైభవంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా శ్రీకృష్ణుడి పల్లకిని గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగించారు. చిన్నారులు కృష్ణుడు, గోపికల వేషధారణలో ముస్తాబై శోభాయాత్రలో పాల్గొన్నారు.
పాటలు, నృత్యాలతో చిన్నారులు ఆకట్టుకున్నారు. పల్లకి ఊరేగింపును తిలకించేందుకు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో వీధుల్లో సందడి నెలకొంది.
Comments
Loading comments...

