వార్తలకు తిరిగి వెళ్లండి

కుంటాల మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్‌ను అప్‌గ్రేడ్ చేసి తెలంగాణ పబ్లిక్ స్కూల్‌గా మార్చేందుకు ప్రభుత్వం జీవో విడుదల చేసిందని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ తెలిపారు. ఇందుకోసం రూ.9 కోట్ల నిధులు మంజురయ్యాయని పేర్కొన్నారు.
ఈ నిధులతో అదనపు తరగతి గదులు, మౌలిక వసతులు, ఇతర సౌకర్యాలు మెరుగు పరుస్తామన్నారు. ప్రాథమిక విద్య నుంచి ఇంటర్ వరకు ఒకే చోట విద్యాభ్యాసం చేసే అవకాశం కలుగుతుందని తెలిపారు.
Comments
Loading comments...

