Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

కుల్సుంపుర పోలీసుల మానవత్వం – నిరాశ్రయుడికి పునరావాసం.

Follow Udayam on Google
Gaurav Bidkar Jul 23, 2026 9:36 AM హైదరాబాద్General
కుల్సుంపుర పోలీసుల మానవత్వం – నిరాశ్రయుడికి పునరావాసం. - Udayam
పురానాపూల్ 100 ఫీట్ల రోడ్డు వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తున్న కుల్సుంపుర పోలీసులు సుమారు 35 సంవత్సరాల వయస్సు గల మానసికంగా అస్వస్థతతో ఉన్న నిరాశ్రయుడిని గుర్తించారు. వెంటనే స్పందించిన పీసీ కిరణ్ కుమార్, హెచ్‌సీ బషీర్ అతనికి ఆహారం అందించి, కుటుంబ సభ్యుల వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించారు. అయితే ఎలాంటి సమాచారం లభించలేదు. ఉన్నతాధికారుల సూచనల మేరకు ఆ వ్యక్తికి మెరుగైన సంరక్షణ, వైద్యం మరియు పునరావాసం కల్పించేందుకు అబ్దుల్లాపూర్ మెట్‌లోని ఆలేటి ఆటమ్ వరల్డ్ అనాథ ఆశ్రమానికి సురక్షితంగా తరలించారు. బాధ్యతాయుతంగా స్పందించి మానవత్వాన్ని చాటిన పోలీసు సిబ్బందిని కుల్సుంపురా ఎస్‌హెచ్‌ఓ అభినందించారు. ప్రజల భద్రతతో పాటు అవసరమైన వారికి సహాయం చేయడంలో హైదరాబాద్ సిటీ పోలీసులు ఎల్లప్పుడూ ముందుంటారని తెలిపారు.

Comments

G
Loading comments...