Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుబీర్‌లో ప్రజావాణి అర్జీలను స్వీకరించనున్న 23 శాఖల అధికారులు

Follow Udayam on Google
Naresh Aug 15, 2026 9:28 PM నిర్మల్General
కుబీర్‌లో ప్రజావాణి అర్జీలను స్వీకరించనున్న 23 శాఖల అధికారులు - Udayam
కుబీర్ మండల కేంద్రంలో సోమవారం నుండి ప్రజావాణి అర్జీలను స్వీకరించనున్నట్లు ఎంపీవో భీమేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా 23 ప్రభుత్వ శాఖల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శుల ద్వారా ఇప్పటికే విస్తృతంగా ప్రచారం చేశామన్నారు. ప్రజలు తమ సమస్యలపై దరఖాస్తులతో తరలివచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

Comments

G
Loading comments...