వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ జిల్లా కుబీర్ మండలం న్యూ సౌంవ్లి గ్రామానికి చెందిన సుశీల(27) ఇంటి ముందున్న షెడ్‌లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. భర్త, అత్తమామల వేధింపులే మృతికి కారణమని ఆమె తల్లి మాలేపు సంధ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సుశీలకు పదేళ్ల క్రితం వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నట్లు ఎస్‌ఐ కృష్ణారెడ్డి తెలిపారు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
Comments
Loading comments...

