వార్తలకు తిరిగి వెళ్లండి

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల పార్టీ జనరల్ బాడీ సమావేశాల్లో ఆయన పాల్గొననున్నారు. పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు, బూత్ లెవల్ కమిటీల బలోపేతంపై కేటీఆర్ దిశానిర్దేశం చేస్తారు.
ఈ పర్యటనలో ఉదయం వేములవాడలో, మధ్యాహ్నం సిరిసిల్లలో కీలక సమావేశాలు జరగనున్నాయి. జిల్లా పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమాల కోసం భారీ ఏర్పాట్లు చేశాయి.
Comments
Loading comments...

