వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు బయలుదేరారు. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు, రాబోయే రాజకీయ పరిణామాలపై దిశానిర్దేశం చేసేందుకు ఆయన ఈ పర్యటనను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ పర్యటనలో భాగంగా నేరడిగొండలో నిర్వహించనున్న బోథ్ నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొంటారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై స్థానిక నేతలతో కేటీఆర్ సుదీర్ఘంగా చర్చించనున్నారు.
Comments
Loading comments...

