Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గులాబీ జెండా ఎగరడం ఖాయం: కేటీఆర్‌

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Jul 20, 2026 5:46 PM హైదరాబాద్General
గులాబీ జెండా ఎగరడం ఖాయం: కేటీఆర్‌ - Udayam
తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బాన్సువాడలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని స్పష్టం చేశారు. పార్టీ మారిన పోచారం శ్రీనివాస్‌రెడ్డి కుడితిలో పడ్డ ఎలుకలా గిలగిలా కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్‌రెడ్డిపై మండిపడుతూ.. రాష్ట్రంలో రైతులు యూరియా కోసం ఇబ్బంది పడుతుంటే, ఢిల్లీకి మాత్రం మూటలు మోయడమే ఆయనకు సరిపోతుందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత పాలనకు ప్రజలు త్వరలోనే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

Comments

G
Loading comments...