కృష్ణానదిలో మునిగి ఇద్దరు విద్యార్థుల మృతి

విజయవాడకు చెందిన నలుగురు విద్యార్థులు గుంటూరు జిల్లా సీతానగరం వైపు కృష్ణానదిలో స్నానానికి దిగారు. ఈ క్రమంలో రమేష్, సాయికృష్ణలు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. వీరిద్దరూ విజయవాడ ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతున్నట్లు పోలీసులు తెలిపారు.
సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను వెలికితీయించారు. అనంతరం శవపంచనామా నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Comments
Loading comments...
