వార్తలకు తిరిగి వెళ్లండి

మదనపల్లెకు హంద్రీ–నీవా కాలువ ద్వారా చేరుతున్న కృష్ణా జలాలకు గురువారం వేకువజామున జలహారతి నిర్వహించారు. కోళ్లబైలు మండలం కట్లాటపల్లి సమీపంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు చేసి జలాలకు హారతి సమర్పించారు.
నియోజకవర్గానికి కృష్ణా జలాలు చేరడంతో తాగునీటి సమస్యకు పరిష్కారం లభించనుందని ఎమ్మెల్యే సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

