వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్‌నినో ప్రభావంతో కృష్ణా, తుంగభద్ర నదులు వెలవెలబోతున్నాయి. ఎగువన వర్షాలు లేక ప్రాజెక్టుల్లోకి వరద రాక, జలాశయాలు అడుగంటిపోయాయి. దీనివల్ల 11 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటి కష్టాలు మొదలయ్యాయి.
ప్రస్తుతం శ్రీశైలంలో వినియోగానికి నీరు తక్కువగా ఉండటంతో తాగునీటి సరఫరాపైనా ప్రభావం చూపే అవకాశం ఉంది. యంత్రాంగం అప్రమత్తమై ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని, లేనిపక్షంలో సాగు, తాగునీటికి తీవ్ర ఇబ్బందులు తప్పవని రైతులు ఆందోళన చెందుతున్నారు.
Comments
Loading comments...

