Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యునాని సేవల విస్తరణ: మంత్రి దామోదర్

Follow Udayam on Google
శివ కుమార్ Jul 14, 2026 11:38 AM హైదరాబాద్General
యునాని సేవల విస్తరణ: మంత్రి దామోదర్ - Udayam
రాష్ట్రంలో యునాని వైద్య సేవలు ప్రజలకు మరింత చేరువ కావాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ అన్నారు. హైదరాబాద్‌లోని నిజామియా టిబ్బీ కాలేజీ, ఆసుపత్రుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని సమీక్షా సమావేశంలో తెలిపారు. నిర్మాణంలో ఉన్న ఓపీ బ్లాక్, ఫార్మసీ భవన పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న వైద్యులు, సిబ్బంది పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కార్యదర్శికి సూచించారు.

Comments

G
Loading comments...