Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కృష్ణా వరదలతో ఎత్తిపోతలు ప్రారంభం.. రైతుల్లో సాగు ఆశలు

Follow Udayam on Google
కృష్ణ మూర్తి Aug 03, 2026 1:03 PM మహబూబ్‌నగర్General
కృష్ణా వరదలతో ఎత్తిపోతలు ప్రారంభం.. రైతుల్లో సాగు ఆశలు - Udayam
కృష్ణా నదికి వరద ప్రవాహం పెరగడంతో జూరాల, శ్రీశైలం ప్రాజెక్టుల ఆధారంగా ఉన్న ఎత్తిపోతల పథకాల మోటార్లు ప్రారంభమయ్యాయి. నెట్టెంపాడు, భీమా, కోయిలసాగర్‌, కల్వకుర్తి పథకాల ద్వారా జలాశయాలకు నీటిని తరలిస్తున్నారు. ఎత్తిపోతల పరిధిలోని చెరువులు, జలాశయాలను నింపేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. వరదలతో ఆయకట్టు ప్రాంతాల్లో సాగు పనులు ఊపందుకునే అవకాశం ఉందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...