వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ లో జనసేన అధినేత,ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఫ్లెక్సీలను దుండగులు చింపివేయడాన్ని ఆ పార్టీ నాయకుడు డాక్టర్ బండారి రాజ్‌కుమార్ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఎదుర్కొనే ధైర్యం లేకే ఇటువంటి పిరికిపంద చర్యలకు పాల్పడుతున్నారన్నారు.
ఫ్లెక్సీలు చింపినంత మాత్రాన జనసేన ఎదుగుదలను అడ్డుకోలేరని స్పష్టం చేశారు.2-టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని,బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
Comments
Loading comments...

