Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్‌లో అక్రమ సంబంధం వివాదం.. రాజీ చర్చల్లో ఇరువర్గాల పరస్పర దాడి

Follow Udayam on Google
Sudheer Sep 26, 2026 6:46 PM కరీంనగర్తెలంగాణ
అక్రమ సంబంధం వ్యవహారంపై రాజీకి వెళ్లిన ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కరీంనగర్ లోని హనుమాన్ నగరంలో రాజు, లావణ్య దంపతుల కుటుంబాల మధ్య రెండు నెలలుగా వివాదం నడుస్తోంది. ఈ విషయమై మాట్లాడేందుకు సమావేశమైన ఇరువర్గాల మధ్య మాట మాట పెరిగి ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో ఇరువర్గాల వారు కట్టెలతో పరస్పరం దాడి చేసుకున్నారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...