Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ లో తాగునీటి ఎద్దడి రానీయొద్దు: కలెక్టర్ చిత్రా మిశ్రా

Follow Udayam on Google
sudheer Aug 12, 2026 8:41 PM కరీంనగర్General
కరీంనగర్ లో తాగునీటి ఎద్దడి రానీయొద్దు: కలెక్టర్ చిత్రా మిశ్రా - Udayam
కరీంనగర్ నగర ప్రజలకు తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. బుధవారం గౌతమ్‌నగర్‌లోని మంచినీటి ఫిల్టర్ బెడ్‌ను కమిషనర్ ప్రఫుల్ దేశాయ్‌తో కలిసి ఆమె పరిశీలించారు. శుద్ధి ప్రక్రియ, సరఫరా విధానాన్ని ఆరా తీశారు. నీటి నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, లభ్యతను బట్టి అన్ని ప్రాంతాలకు క్రమబద్ధంగా నీటిని సరఫరా చేయాలని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...