Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ కమాన్ వద్ద లేబర్ కోడ్ ప్రతుల దహనం

Follow Udayam on Google
sudheer Aug 10, 2026 4:54 PM కరీంనగర్General
కరీంనగర్ కమాన్ వద్ద లేబర్ కోడ్ ప్రతుల దహనం - Udayam
కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ నిర్వహించిన దేశవ్యాప్త ‘జైల్ భరో’లో భాగంగా కరీంనగర్ కమాన్ వద్ద ఏఐటీయూసీ, టీయూసీఐ నాయకులు ధర్నా చేపట్టారు. కార్మిక, రైతు సంఘాల ఆధ్వర్యంలో కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నూతన లేబర్ కోడ్ ప్రతులను దహనం చేశారు. కార్మిక వ్యతిరేక చట్టాలను తక్షణమే రద్దు చేయాలని, లేకుంటే ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తామని నేతలు హెచ్చరించారు.

Comments

G
Loading comments...