వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ కలెక్టరేట్ వద్ద ఆటో కార్మికులు మంగళవారం భిక్షాటన చేస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. రోజురోజుకూ తమ సమస్యలు తీవ్రమవుతున్నాయని వాపోయారు.
ఆన్‌లైన్ రాపిడో, క్యాబ్ సర్వీసులు నిబంధనలకు విరుద్ధంగా నడపటం వల్ల తమ ఉపాధి దెబ్బతింటోందని మండిపడ్డారు. మహాలక్ష్మి పథకం, లోకల్ బస్సులతో ఆదాయం తగ్గడంతో కుటుంబాలు గడవడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

