వార్తలకు తిరిగి వెళ్లండి

లక్షెట్టిపేట మండలంలో 18 ఏళ్లు నిండిన వారు కొత్త ఓటర్లుగా పేరు నమోదు చేసుకునేందుకు బుధవారం ఆఖరి తేదీ అని తహశీల్దార్ దిలీప్‌కుమార్ తెలిపారు. సర్వేలో పేరులేని వారు, కొత్తగా అర్హత పొందిన వారు ఫారం-6 పూర్తి చేసి స్థానిక బీఎల్‌వోలకు అందించాలని సూచించారు.
ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఓటరు నమోదు ప్రక్రియ చేపట్టినట్లు తెలిపారు. తుది ఓటరు జాబితాను నవంబర్ 9న ప్రకటిస్తామని తహశీల్దార్ పేర్కొన్నారు.
Comments
Loading comments...

