వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్లాపూర్ రేణుక ఎల్లమ్మ జాతర ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. శుక్రవారం భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. బోనాలతో ప్రదక్షిణలు చేస్తూ నైవేద్యాలు సమర్పించి, పొర్లు దండాలతో మొక్కులు చెల్లించుకున్నారు.
ఆలయ పరిసరాల్లో కుటుంబసభ్యులతో కలిసి భక్తులు సహాపంక్తి భోజనాలు చేశారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో శేఖర్ గౌడ్, కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
Comments
Loading comments...

