వార్తలకు తిరిగి వెళ్లండి

ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం శనివారం వాయుగుండంగా బలపడి ఏపీ తీరం వైపు కదిలే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజులు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
Comments
Loading comments...

