వార్తలకు తిరిగి వెళ్లండి

అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి ఏపీ తీరం వైపు కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాగల మూడు రోజులు దక్షిణ కోస్తా, రాయలసీమల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
కాగా శుక్రవారం కోనసీమ జిల్లా నగరంలో అత్యధికంగా 9.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే తణుకు, చోడవరం, మచిలీపట్నం సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసినట్లు అధికారులు వెల్లడించారు.
Comments
Loading comments...

