కోళ్ల దొంగతనం.. వ్యక్తి దుర్మరణం

తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం మధురపూడిలో కోళ్ల దొంగతనానికి వచ్చిన వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. దొంగతనాన్ని గుర్తించిన ఫారం యజమాని నరేశ్‌ను పట్టుకొని చెట్టుకు కట్టేశాడు. కాపలాదారులు తీవ్రంగా కొట్టడంతో అతడు మరణించాడు.
మృతుడు కృష్ణా జిల్లాకు చెందిన నరేశ్‌గా పోలీసులు గుర్తించారు. అతడిపై గతంలో ఐదు దొంగతనం కేసులు ఉన్నట్లు తెలిపారు. ఈ ఘటనలో పాల్గొన్న మరో ముగ్గురు పరారీలో ఉన్నారు.
Comments
Loading comments...
