కోకాపేట్ సమీపంలో ఎలక్ట్రిక్ కారులో మంటలు

ఔటర్ రింగ్ రోడ్డుపై కోకాపేట్ సమీపంలో లారీని ఎలక్ట్రిక్ కారు ఢీకొట్టింది. కారులో నలుగురు ఉన్నారు. కోకాపేట్ నుంచి పటాన్‌చెరు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. కొద్ది నిమిషాలకే కారులో మంటలు చెలరేగడంతో నలుగురూ వెంటనే కిందకు దిగి ప్రాణాలు కాపాడుకున్నారు.
క్షణాల్లో కారు మంటల్లో చిక్కుకుంది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు. నలుగురూ సురక్షితంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది.
Comments
Loading comments...
