Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోహెడలో NHIS సర్వే పరిశీలన

Follow Udayam on Google
Kiran Sep 10, 2026 2:22 PM సిద్దిపేటGeneral
కోహెడలో NHIS సర్వే పరిశీలన - Udayam
కోహెడ మండలం తంగళ్లపల్లిలో జరుగుతున్న జాతీయ కుటుంబ ఆదాయ సర్వే (ఎన్‌హెచ్‌ఐఎస్‌) పనులను కరీంనగర్‌ ఎన్‌ఎస్‌ఓ సీనియర్‌ గణాంక అధికారి గోవర్ధన శ్రీనివాసరావు గురువారం పరిశీలించారు. సర్వే సిబ్బంది బి. నవీన్‌కుమార్‌ నిర్వహిస్తున్న పనులను తనిఖీ చేశారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి ఖచ్చితమైన సమాచారాన్ని అందించి సర్వేకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్‌ బోయిని సంపత్‌ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...