కోడితో మొదలైన గొడవ.. ఘర్షణ

మార్కాపురం జిల్లాలో కోడి విషయంలో మొదలైన వివాదం వైకాపా, తెదేపా వర్గీయుల మధ్య ఘర్షణకు దారితీసింది. త్రిపురాంతకం మండలం విశ్వనాథపురంలో ఇరువర్గాలు కారం చల్లుకుంటూ, రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఎస్సై సహా పదిమందికి పైగా గాయపడ్డారు.
మరోవైపు కొనకనమిట్ల మండలం పెదారికట్ల నామినేషన్ కేంద్రం వద్ద కూడా ఇరుపార్టీల నాయకులు, కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది.
Comments
Loading comments...
