Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోడి పందాలు స్థావరంపై పోలీసులు దాడి.. 17మంది అరెస్ట్

devendra Jul 22, 2026 4:14 PM తూర్పుగోదావరి in about 4 hours
​రంగంపేట మండలం జి.దొంతమూరులో భారీగా జరుగుతున్న కోడిపందాల స్థావరంపై పోలీసులు మంగళవారం దాడి చేశారు. సీఐ సుమంత్ ఆధ్వర్యంలో ఎస్ఐలు వినయ్ ప్రతాప్, శివప్రసాద్ సిబ్బందితో కలిసి పవన్ రెడ్డికి చెందిన పామాయిల్ తోటలో ఈ తనిఖీలు చేపట్టారు. పందాలు కాస్తున్న 17 మందిని అరెస్టు చేసి, వారి నుంచి రెండు కార్లు, 24 ద్విచక్రవాహనాలు, 10 కోళ్లు, కత్తులు, రూ.57,620 నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.

Comments

G
Loading comments...