Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోదాడలో మిషన్ భగీరథ నీటి వృథా

Follow Udayam on Google
Kiran Nov 02, 2026 11:34 AM సూర్యాపేటGeneral
కోదాడలో మిషన్ భగీరథ నీటి వృథా - Udayam
కోదాడ నయానగర్‌ కృష్ణప్రియ థియేటర్‌ బజార్‌లో మిషన్‌ భగీరథ పైపుల నుంచి నీరు లీకై వృథాగా పోతోంది. రెండు రోజులుగా నీటి సరఫరా లేక ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు తెలిపారు. సరఫరా కావాల్సిన నీరు లీకేజీతో వృథా అవుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే మరమ్మతులు చేపట్టి నీటి సరఫరాను పునరుద్ధరించాలని కోరారు.

Comments

G
Loading comments...