వార్తలకు తిరిగి వెళ్లండి

వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గుత్తి మండల తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా గత 19 రోజులుగా చేస్తున్న నిరువధిక దీక్షలు సోమవారం 20వ రోజుకు చేరాయి.
వీఆర్ఏల సంఘం అధ్యక్షుడు సుధాకర్ మాట్లాడుతూ.. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, వీఆర్ఏలకు ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు. వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేస్తున్న ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదన్నారు.
Comments
Loading comments...

