Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొండగట్టులో జేఎన్టీయూహెచ్ విద్యార్థుల స్వచ్ఛభారత్

Follow Udayam on Google
Myadari vamshi vardhan Aug 13, 2026 12:53 PM జగిత్యాలGeneral
కొండగట్టులో జేఎన్టీయూహెచ్ విద్యార్థుల స్వచ్ఛభారత్ - Udayam
ప్రసిద్ధ క్షేత్రం కొండగట్టు అంజనేయస్వామి ఆలయ పరిసరాల్లో గురువారం నాచుపల్లి జేఎన్టీయూహెచ్ విద్యార్థులు స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు ఆలయ పరిసరాలు, భక్తులు సంచరించే ప్రాంతాల్లో దాదాపు 300 మంది విద్యార్థులు పాల్గొని చెత్తను తొలగించి శుభ్రం చేశారు. అదే విధంగా కొండ దిగువన దొంగలమర్రి ప్రాంతంలో మరో 200 మంది విద్యార్థులు స్వచ్ఛభారత్ నిర్వహించారు. భక్తులకు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.

Comments

G
Loading comments...