Udayam Digital
Menu

కొండగట్టులో అంజన్న దర్శనం

Shruthi Nov 21, 2026 7:10 AM కరీంనగర్General
కొండగట్టులో అంజన్న దర్శనం - Udayam Digital
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో 60 ఏళ్ల తర్వాత మూలవిరాట్‌పై చందనం తొలగింపు వేడుకలు ఘనంగా ముగిశాయి. అర్చకులు ఐదు నదీ జలాలు, సముద్రపు నీటితో అభిషేకం నిర్వహించి, అద్దంలో స్వామివారి నిజరూపాన్ని దర్శించుకున్నారు. భద్రాచలం నుంచి తెచ్చిన పట్టువస్త్రాలను అలంకరించగా, సభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్, మంత్రి లక్ష్మణ్‌కుమార్ దర్శించుకున్నారు. డిసెంబరు 29 వరకు భక్తులకు నిజరూప దర్శనం కల్పిస్తారు.

Comments

G
Loading comments...