వార్తలకు తిరిగి వెళ్లండి

మల్యాల మండలంలోని కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానంలో బుధవారం నిర్వహించిన హుండీ లెక్కింపులో డమ్మీ నోట్లు కలకలం రేపాయి. 13 హుండీలకు 80 రోజులుగా వచ్చిన కానుకలను లెక్కించగా రూ.1.62 కోట్లకు పైగా ఆదాయం నమోదైంది.
లెక్కింపు సమయంలో సుమారు రూ.2.50 లక్షల విలువైన ఐదు బెండళ్ల డమ్మీ నోట్లు గుర్తించారు. వాటిని అధికారులు వేరు చేసి స్వాధీనం చేసుకున్నారు.దేవస్థాన అధికారులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.
Comments
Loading comments...

