Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొండగట్టు అంజన్న ఆలయంలో వైభవంగా వరుణ జపం, యాగం

nerella Srinivas Jul 24, 2026 1:19 PM జగిత్యాలabout 9 hours ago
కొండగట్టు అంజన్న ఆలయంలో వైభవంగా వరుణ జపం, యాగం - Udayam Digital
ఎల్ నినో ప్రభావంతో ఏర్పడిన వర్షాభావం తొలగి రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ, దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానంలో శుక్రవారం వరుణ జపం, వరుణ యాగం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి విశేష అభిషేకం నిర్వహించి, రైతులకు అనుకూలంగా సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని ప్రార్థించారు. కార్యక్రమంలో ఈఓ ఎస్. అంజనారెడ్డి, ఏఈఓ హరిహారనాథ్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...