Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొండెక్కుతున్న కోడి రేటు...

Follow Udayam on Google
sai Krishna Patel Jul 07, 2026 2:26 PM హైదరాబాద్బిజినెస్
కొండెక్కుతున్న కోడి రేటు... - Udayam
రాష్ట్రంలో చికెన్ ధరలు భగ్గుమంగున్నాయి. ఆదివారం రోజున కిలో స్కిన్లెస్ చికెన్ రూ.350-నుంచి 360 వరకు, బోన్లెస్ చికెన్ రూ.640 వరకు అమ్ముడైంది. సాధారణంగా వానాకాలంలో తగ్గే చికెన్ ధరలు ఈసారి మాత్రం పెరుగుతూనే ఉన్నాయి.ఆదివారం స్కిన్లెస్ చికెన్ ధరలు కిలో రూ.360 వరకు అమ్మగా లైవ్బర్డ్కిలో రూ.220 వరకు విక్రయించారు. ఇక బోన్లెస్ చికెన్ రూ.640 వరకు ధరలు పలకడం గమనార్హం గడిచిన వారం రోజుల్లో రూ.300 నుంచి రూ. 320 మధ్య ఉండగా నుంచి ఏకంగా రూ.350కి పెరిగింది.బోన్లెస్ రూ.550 నుంచి రూ.640కి పెరిగింది. వారం రోజుల్లో పెరిగి ఆదివారం నాటికి రూ. 350 దాటిందని మార్కెట్వర్గాలు చెబుతున్నాయి. కోళ్ల దాణా ధరలు పెరుగుతున్న నేపథ్యంలో దీన్ని ఆసరాగా చేసుకుని నిరుడు వచ్చిన నష్టాన్ని పూడ్చుకోవడానికి పౌల్ట్రీ వర్గాలు ధరలు పెంచుతున్నట్లు సమాచారం.

Comments

G
Loading comments...