Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొండా లక్ష్మణ్ బాపూజీకి ఘన నివాళి

Follow Udayam on Google
Alluri Mahesh Sep 27, 2026 12:14 PM ఆదిలాబాద్తెలంగాణ
కొండా లక్ష్మణ్ బాపూజీకి ఘన నివాళి - Udayam
ఆదిలాబాద్‌: ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ 111వ జయంతిని పురస్కరించుకుని కాంగ్రెస్‌ శ్రేణులు ఘనంగా నివాళులర్పించాయి. డీసీసీ కార్యాలయంలో చిత్రపటానికి, గాంధీ పార్క్‌లోని విగ్రహానికి డీసీసీ అధ్యక్షుడు డాక్టర్‌ నరేష్‌ జాదవ్‌ పూలమాలలు వేశారు. బాపూజీ తెలంగాణ ఉద్యమం, బహుజనులు, చేనేత కార్మికుల హక్కుల కోసం చేసిన పోరాటాలు స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్‌రెడ్డి, ఆశమ్మ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...