వార్తలకు తిరిగి వెళ్లండి

కొండగట్టు గిరి ప్రదక్షిణ మార్గం మూడేళ్లైనా పూర్తిస్థాయిలో అభివృద్ధి కాలేదు. వర్షాలతో దారి దెబ్బతిని, పలుచోట్ల చెట్ల కొమ్మలు అడ్డుగా మారాయి. ఈ నెల 29న జరిగే గిరి ప్రదక్షిణకు భారీగా భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది.
రూ.30 కోట్లతో మార్గం అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధమైనా పనులు ప్రారంభం కాలేదు. దారిని విస్తరించి రక్షణ గోడలు, పార్కింగ్, మరుగుదొడ్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని అధికారులు సూచించారు.
Comments
Loading comments...

