కొమురవెల్లిలో భక్తులకు కొత్త సౌకర్యాలు

కొమురవెల్లి మల్లన్న భక్తుల కోసం నిర్మించిన 50 గదుల వసతి గృహాలు, క్యూ కాంప్లెక్స్‌ను సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట సభ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. ఆలయ అధికారులు, అర్చకులు నూతన భవనాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సౌకర్యాలతో దర్శనానికి వచ్చే భక్తులకు వెసులుబాటు కలగనుంది. రద్దీ వేళల్లో క్యూ కాంప్లెక్స్‌తో ఇబ్బందులు తగ్గడంతో పాటు, దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు వసతి సౌకర్యం మెరుగుపడనుంది.
Comments
Loading comments...
