వార్తలకు తిరిగి వెళ్లండి

కొమరాడలో 7 రోజులుగా మంచినీటి సరఫరా లేకపోవడంతో మరడాన వీధిలో మహిళలు ఖాళీ బిందెలతో బుధవారం నిరసన చేపట్టారు. సీపీఎం మండల కన్వీనర్ సాంబమూర్తి ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో మహిళలు పాల్గొన్నారు.
అధికారులు హామీ ఇచ్చినా నీరు అందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపటి లోగా నీరు అందించకపోతే ఎంపీడీవో కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
Comments
Loading comments...

