వార్తలకు తిరిగి వెళ్లండి

కొలిమిగుండ్లలో రూ.10 లక్షలతో నిర్మించిన నూతన రైతు సేవా కేంద్రం ప్రారంభానికి నోచుకోకుండా నిరుపయోగంగా మారింది. రైతుల అవసరాల కోసం ఎంఈవో కార్యాలయం సమీపంలో గత ప్రభుత్వం ఈ భవనాన్ని నిర్మించింది.
అయితే కేంద్రాల విలీన ప్రక్రియలో భాగంగా అధికారులు భవనాన్ని ప్రారంభించలేదు. దీంతో ప్రభుత్వ నిధులు వృథా అవుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Loading comments...

