వార్తలకు తిరిగి వెళ్లండి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కోసం కొడంగల్‌లో పక్కా ఏర్పాట్లు చేయాలని కమిషనర్ ముకుంద రెడ్డి ఆదేశించారు. సభా ప్రాంగణంలో ఎల్‌ఈడీ స్క్రీన్లు, పార్కింగ్ వసతులు కల్పించాలని, సాంకేతిక సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
ఈ పర్యటనను లైవ్ కవరేజ్ చేసేందుకు డ్రోన్ కెమెరాలు, వీడియో గ్రాఫర్లను సిద్ధం చేయాలన్నారు. కడా అధికారులతో సమీక్ష నిర్వహించి, సీఎం పర్యటన విజయవంతం అయ్యేలా అన్ని విభాగాల సమన్వయంతో పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

