Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కంచర్లవారిపల్లిలో పోషణ కార్యక్రమం

Follow Udayam on Google
Anuroop Sep 15, 2026 4:43 PM మార్కాపురంGeneral
కంచర్లవారిపల్లిలో పోషణ కార్యక్రమం - Udayam
కనిగిరి మండలం కంచర్లవారిపల్లి అంగన్‌వాడీ కేంద్రంలో మంగళవారం ‘మన అంగన్‌వాడీ-మన బాధ్యత’ ఇతివృత్తంతో జాతీయ పోషణ మాసం-2026 కార్యక్రమం నిర్వహించారు. ఐసీడీఎస్ సూపర్‌వైజర్‌ ఎంవీఎస్‌ పార్వతి ఆధ్వర్యంలో చిన్నారుల పోషణ, ఆరోగ్యం, సంరక్షణలో అంగన్‌వాడీ కేంద్రాల ప్రాధాన్యతను వివరించారు. తృణధాన్యాలు, పప్పులు, పాలు, గుడ్లు, కూరగాయలు, పండ్లు వంటి పోషకాహారం తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు.

Comments

G
Loading comments...