Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కమ్మర్ పల్లి కస్తూర్బా పాఠశాలలో ఆరోగ్య పరీక్షలు

Follow Udayam on Google
Kiran Nov 03, 2026 6:22 PM నిజామాబాద్General
కమ్మర్ పల్లి కస్తూర్బా పాఠశాలలో ఆరోగ్య పరీక్షలు - Udayam
కమ్మర్ పల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలలో విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించినట్లు వైద్యాధికారి డాక్టర్ నరసింహస్వామి తెలిపారు. చిన్నచిన్న రుగ్మతలతో బాధపడుతున్న వారికి మందులు పంపిణీ చేశారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో హెల్త్ సూపర్‌వైజర్ ఆకుల మారుతి, సిస్టర్ స్వరూప, ఆశాలు సంధ్య, హారిక, సాగరిక, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

Comments

G
Loading comments...