Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కళ్యాణ మండప నిర్మాణానికి గ్రామస్తులచే భూమి పూజ

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Aug 22, 2026 12:53 PM నిర్మల్General
కళ్యాణ మండప నిర్మాణానికి గ్రామస్తులచే భూమి పూజ - Udayam
ముథోల్ మండలంలోని ఎడ్బిడ్ గ్రామంలో రెడ్డి సంఘం ఆధ్వర్యంలో కళ్యాణ మండప నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామంలో సామాజిక అవసరాల కోసం కళ్యాణ మండపాన్ని నిర్మించేందుకు చేపట్టిన ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య భూమిపూజ నిర్వహించి, నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. మండపం నిర్మాణంతో స్థానికులకు సౌకర్యవంతంగా ఉంటుందన్నారు.

Comments

G
Loading comments...