వార్తలకు తిరిగి వెళ్లండి
కళాకారులందరికీ 40 ఏళ్లకే పింఛన్లు ఇవ్వాలని ప్రజానాట్య మండలి కళాకారిణి జానకి డిమాండ్ చేశారు. సోమవారం విజయనగరం కలెక్టరేట్ ఎదుట జరిగిన ధర్నాలో ఆమె మాట్లాడుతూ.. గతంతో పోలిస్తే కళలకు ఆదరణ తగ్గిందని ఆవేదన వ్యక్తం చేశారు.
దీనివల్ల కళాకారులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం కళాకారులకు గుర్తింపు కార్డులు మంజూరు చేసి, నెలకు రూ.10 వేల పింఛన్ అందించాలని కోరారు.
Comments
Loading comments...

