Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కలెక్టర్ సూచనలతో లైబ్రరీకి కొత్త రూపం

Follow Udayam on Google
Kiran Oct 08, 2026 1:16 PM జగిత్యాలGeneral
కలెక్టర్ సూచనలతో లైబ్రరీకి కొత్త రూపం - Udayam
మల్లాపూర్ మోడల్ స్కూల్‌ను బుధవారం కలెక్టర్ బి.సత్యప్రసాద్ తనిఖీ చేశారు. లైబ్రరీలో షూస్, బ్యాగులు, కార్టూన్ బాక్సులు ఉండటంతో స్టోర్‌రూమ్‌లా కనిపించడాన్ని గమనించారు. సామగ్రిని క్రమబద్ధీకరించి లైబ్రరీని శుభ్రంగా ఉంచాలని సూచించారు. కలెక్టర్ సూచనల మేరకు గురువారం ప్రిన్సిపల్ భూమేష్ ఆధ్వర్యంలో గదిని శుభ్రపరిచారు. సామగ్రిని సర్దుబాటు చేసి లైబ్రరీని శుభ్రంగా, క్రమబద్ధంగా ఏర్పాటు చేశారు.

Comments

G
Loading comments...